SFJ నూతన పాట – బైబిల్ లో ఉన్నటువంటి స్త్రీలను జ్ఞాపకం చేస్తూ మహిళలను పురికొలిపే విధంగా వ్రాయబడిన గీతం

SFJ – క్రైస్తవ మగువా

పల్లవి
క్రైస్తవ మగువా…! చూపుము తెగువ
పరిచారికగా…! సేవలు సలుప – 2
నీవు లేచి బోధించు మోసాల కట్లను త్రెంచు
స్త్రీ పురుష బేధమేదియు దైవమందు లేదని చెప్పు

అను పల్లవి
భయాలన్నిటిని జయించి నీవు
పురుషునితో సమమని ఎంచు
మమకార ముర్తివి గనుక నీకే
చివరి ఆజ్ఞకు సాధన తెలుసు//బైబిల్//

చరణం : 1
మిర్యాము, దెబోరాలు,
హుల్డా,  ఎస్తేరులు
హన్న,మరియ, ఎలీసబెత్లు
ఫిలిప్పుకు కుమార్తెలు 2
ఈ పవిత్ర వేద గ్రంధపు
ప్రవక్తినిలు మాదిరి నీకు
ఎవరు చిన్న చూపు చూసినా
ప్రభువే నిన్ను నిలుపును కడకు – 2
ధీర వనితవై సాగుము నీ యాత్రలో
వేవేల ఆత్మల చేర్చగ ప్రభు సన్నిధిలో (భయా)

చరణం 2
అనీ అదోనిరాం జడ్సన్,
క్యాతరిన్, ఎలియట్, స్లేసర్
ఫ్లోరెన్స్, సుసన్న వెస్లీ,
క్లోరిటెన్ గ్లాడిస్ ఆల్విన్ – 2
శుభవార్త పరిచర్యలో
ప్రపంచ దేశాలను చుట్టారు
పలు జాతుల రక్షణలో
సాహస క్రియలను చెబూనారు – 2
ధీర వనితవై సాగుము నీ యాత్రలో
వేవేల ఆత్మల చేర్చగ ప్రభు సన్నిధిలో( భయా)

చరణం 3
ప్రభువుకు పరిచర్య చేసిరి
ఆత్మతొ శుభ వార్త చాటిరి
గృహాలలో సంఘమున్ నడిపి
హత సాక్షులుగా నిలిచిరి -2
నీ భర్తకు లోబడి నీవు సంఘ సేవలో కొనసాగాలి
ఆత్మీయ అలంకారమున వధువుగా సిద్ధపడాలి -2
ధీర వనితవై సాగుము నీ యాత్రలో
వేవేల ఆత్మల చేర్చగ ప్రభు సన్నిధిలో( భయా)

Subscribe
Notify of
guest
3 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Dr. Samuel

Happy Womens Day….🌹🌹
Very Good Song…..🙏🙏

Janardhan

Superb sir….

Janardhan

Praise God…

Very very nice….