CREDITS:
Script: Bro. Mahesh SFJ
Music and lyrics: Mani Prakash
Vocals: Lillian Christopher
Sponsors: HC Sambaiah – Glory (HYD)
Video: Bro. Sagar SFJ
పల్లవి
ధనమా దైవమా యోచించుమా – ప్రియ నేస్తమా క్రైస్తవ జనాంగమా
సిరికినీ దేవునికి దాసులుగా ఉండ దగునా ప్రభువు మెచ్చునా
ధనాపేక్షను చంపి వేయుము
మోక్ష రాజ్యమున చోటు పొందుము ||ధనమా||
చరణం 1
భూ సంపదలన్నియు క్షయమైపోయే ధనం
పర సంబంధమైనదే అక్షయమైన ధనం – 2
ధనముకు హృదయమునిచ్చినచో – అది విగ్రహారాధన కాదా ?!
భువిపై నుండగనే పరలోక ధనాన్ని కుర్చుకో – 2
ఆత్మల రక్షణకై నమ్మకముగ ధనమును వాడుకో ||ధనమా||
చరణం 2
పాత నిబంధన దీవెనలు తాత్కాలికమైనవి
నూత్న నిబంధన దీవెనలు శాశ్వతమైనది – 2
యాత్రికులము పరదేశులమని – పితరులు గుడారమందుండిరి
పాప భోగముగ సిరులను ఎంచి ఐగుప్తునే విడిచిరి
అల్పకాల సుఖముల విడిచి క్రీస్తును వెంబడించిరి ||ధనమా||
చరణం 3
ధనవంతులైన వారికి పరలోకం దుర్లభం
ప్రభువును వెంబడించిన నూరు రెట్లు ఫలం – 2
దేవుని ప్రేమించు పరిశుద్ధులు – నిత్య జీవముకు పాత్రులు – 2
ధనాపేక్ష విడిచి కీడుల నుండి తప్పించుకో
అన్న వస్త్రములతో తృప్తిగ జీవించ నేర్చుకో ||ధనమా||
చరణం 4
ఆది సంఘము ఆస్తులు విడిచి ధనవంతులైరి ఆత్మలో
భూములను సంపాదనలమ్మి ఆత్మల సంపాదించిరి – 2
వెండిని పసిడిని విడిచిరి పరిశుద్ధాత్మను పొందిరి – 2
క్రీస్తు సిలువను మించినది లేదని నిజముగ నమ్మిరి
కలిమిని వ్యర్థముగానెంచి జీవ కిరీటము పొందిరి ||ధనమా||
All rights reserved to SFJAPTS